ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల సమాచారం మేరకు గంగారం గ్రామ శివారులోని రంగయ్య కుంటలో ప్రమాదవశాత్తు పడి మైబు(60) అనే వ్యక్తి మృతి చెందాడు.
గంగారం గ్రామానికి చెందిన మైబు ఉదయం చేపలు పట్టడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువులోకి దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మృతుడికి ఆరుగురు సంతానం కలదు. కుటుంబ పెద్ద మరణంతో ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.మైబు మృతి విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో వారొచ్చి విచారిస్తున్నారు.