మైనర్ బాలికతో రహస్య పెళ్లి..మనసు మార్చుకోవడంతో దారుణ హత్య

-

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన యువతిని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేసి చంపాడు. గాయత్రీ, ఢిల్లీ బాబు అనే ఇద్దరు టీనేజర్ల మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు నెలల క్రితం వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వీరిలో గాయత్రి మైనర్ కావడంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి తిరిగి పంపించి వేశారు.

అయితే పోలీసుల కౌన్సిలింగ్ తో మనసు మార్చుకున్న గాయత్రీ ఢిల్లీ బాబు దూరంగా పెట్టినట్లు సమాచారం. దీంతో ఆమెను తిరిగి పొందాలని చాలా ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ఢిల్లీ బాబు ఆమెను మాట్లాడాలని పిలిచి 15 సార్లు గాయత్రి మీద కత్తితో పొడిచిన చంపినట్లు సమాచారం అందుతోంది. ఆమెను హత్య చేసి నిందితుడు పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహావేశాలతో ఉన్న గాయత్రి బంధువులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. నిందితుడి తండ్రి మీద కూడా దాడి చేయడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version