రైలులో పోగొట్టుకున్న ప‌ర్సు.. అతనికి 14 ఏళ్ల‌కు దొరికింది..!

-

సాధార‌ణంగా రైళ్లలో మ‌నం ఏవైనా వ‌స్తువుల‌ను పోగొట్టుకుంటే.. ఇక అంతే సంగ‌తులు. అస‌లు మ‌నం రైళ్ల‌లోనే కాదు.. ఎక్క‌డైనా ఏదైనా వ‌స్తువును కోల్పోతే.. తిరిగి అది మ‌న‌కు దొర‌క‌డం చాలా క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ ఆ వ్య‌క్తికి మాత్రం త‌న ప‌ర్సు మ‌ళ్లీ దొరికింది. అది కూడా రైలులో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు 14 ఏళ్ల కింద‌ట దాన్ని అత‌ను పోగొట్టుకున్నాడు. తాజాగా ఇటీవ‌లే అత‌నికి ఆ పర్సును రైల్వే పోలీసులు మ‌ళ్లీ అప్ప‌గించారు.

హేమంత్ ప‌డ‌ల్క‌ర్ అనే వ్య‌క్తి న‌వీ ముంబై స‌మీపంలోని పన్వెల్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 2006లో అత‌ను ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ టెర్మిన‌స్‌లో లోక‌ల్ ట్రెయిన్‌లో ప్ర‌యాణిస్తుండ‌గా.. అత‌ని ప‌ర్సు పోయింది. అందులో అప్పట్లో రూ.900 ఉండేవి. అయితే ఆ ప‌ర్సును కొట్టేసిన వారు అప్ప‌ట్లోనే దొరికారు. కానీ వారి నుంచి దాన్ని రిక‌వ‌రీ చేసి ఇచ్చేందుకు రైల్వే పోలీసుల‌కు ఏకంగా 14 ఏళ్లు ప‌ట్టింది. ఇటీవ‌లే ఏప్రిల్ నెల‌లో ఆ ప‌ర్సును హేమంత్‌కు రైల్వే పోలీసులు అంద‌జేయాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వ‌ల్ల అది సాధ్యం కాలేదు. దీంతో అత‌నికి తాజాగా ప‌ర్సును పోలీసులు అంద‌జేశారు.

అయితే ప‌ర్సులో ఉన్న రూ.900ల‌లో రూ.100 ను పోలీసులు స్టాంప్ డ్యూటీ కింద క‌ట్ చేశారు. మిగిలిన రూ.800ల‌లో రూ.300 ఇచ్చారు. బ్యాలెన్స్ రూ.500 పాత నోటు. అందువ‌ల్ల దాన్ని కొత నోటుతో మార్చి ఇస్తామ‌ని తెలిపారు. దీంతో హేమంత్ ఆ రూ.500ను కూడా త్వ‌ర‌లో తీసుకోనున్నాడు. ఏది ఏమైనా.. త‌న ప‌ర్సు త‌న‌కు మ‌ళ్లీ దొరికినందుకు హేమంత్ పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version