10 కోట్ల జీతం, శాండ్ విచ్ కి కక్కుర్తి పడ్డాడు…!

-

సాధారణంగా కోట్ల రూపాయలు జీతాలు ఉన్న వాళ్ళు ఎం చేస్తారు…? వాళ్లకు డబ్బులు అనేది అసలు విషయమే కాదు. ఏది కావాలన్నా సరే క్షణాల్లో వాళ్ళ ముందు ఉంటుంది. అది ఏది అయినా సరే వాళ్లకు పెద్ద విషయం కానే కాదు. కాని 10 కోట్ల జీతం ఉన్న ఒక బ్యాంక్ మేనజర్ శాండ్ విచ్ కి కక్కుర్తి పడ్డాడు. యూరప్‌లో బ్యాంకింగ్‌ లో అతి పెద్ద బ్యాంకు గా ఉన్న సిటీ బ్యాంకు లో పరాష్ షా అనే వ్యక్తి సీనియర్ మేనేజర్ అన్నమాట.

అతనికి శాండ్ విచ్ లు దొంగతనం చేసే అలవాటు ఎక్కువగా ఉంది. అతని జీతం ఎంతా అంటే ఏడాదికి 10 కోట్ల రూపాయలు. లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నుంచి పదే పదే ఆహారాన్ని దొంగాలించడం బయటపడింది. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి బ్యాంకు యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. దీనితో ఆయన్ను విధుల నుంచి తప్పించింది.

ఆయన ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కూడా. లండన్‌లోని ఎడ్మాంటన్‌లో గ్రామర్‌ స్కూల్‌, బాత్‌ యూనివర్శిటీలో 2010లో ఎకనామిక్స్‌లో డిగ్రీ, హెచ్‌ఎస్‌బీసీలో ఇన్‌కమ్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో ఏడేళ్లు పని చేసి సిటి గ్రూప్ లో జాయిన్ అయ్యారు. యూరప్‌తోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు షా హెడ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను సస్పెండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయనపై కేసులు కూడా నమోదు చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version