విమానం గాల్లో ఉండగా.. వాష్ రూం అనుకొని ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు..!

-

మన దేశంలో విమాన ప్రయాణం చాలా చీప్ అయిపోయింది. ట్రెయిన్ కు అయ్యే ఖర్చే కంటే తక్కువ ఖర్చుకే విమానం ప్రయాణం చేయొచ్చు. దీంతో చాలా మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. ఇప్పుడిప్పుడే చాలామంది విమానంలో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి సారి విమాన ప్రయాణం అంటే కాస్త ఆసక్తి, ఇంకాస్త భయం.. మరింకాస్త ఆందోళన ఉండటం సహజం.

ఇలాగే ఓ వ్యక్తి మొదటి సారి విమానం ఎక్కి రచ్చ రచ్చ చేశాడు. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న గోఎయిర్ విమానం ఎక్కిన ఆ వ్యక్తి విమానం టేక్ఆఫ్ అయిన తర్వాత తన సీటులో నుంచి లేచి నేరుగా విమానం చివర వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అనంతరం విమానం ఎగ్జిట్ డోర్ ను ఓపెన్ చేయబోయాడు. మనోడి విచిత్ర చర్యను చూసి షాకయిన మిగితా ప్రయాణికులు వెంటనే క్యాబిన్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్లి అతడిని అడ్డుకున్నారు.

విమానం పాట్నాలో లాండ్ అయ్యాక అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. వాళ్లు అతడిని విచారించగా అతడు చెప్పిన మాటలు విని షాకయ్యారు. అర్జెంట్ గా టాయిలెట్ కు వెళ్లడం కోసం అటువైపు తాను వెళ్లానని.. అది టాయిలెట్ అనుకొని దాన్ని ఓపెన్ చేయబోయానని … అది ఎగ్జిట్ డోర్ అని తనకు తెలియదని ఆ ప్రయాణికుడు చెప్పడంతో… ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయకపోవడంతో పూచికత్తు మీద ఆ వ్యక్తిని పోలీసులు వదిలిపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version