ప్రేమ, పెళ్లి పేరుతో లోబారుచుకున్నాడు…చివరికి..!

-

ప్రేమిస్తున్నాను అని వెంట పడ్డాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా యువతి అతడిని నమ్మి తే శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటే ముఖం చాటేశాడు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నిన్నెలా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక అనే యువతి నెన్నెల గ్రామానికి చెందిన అక్రమ్ అనే యువకుడితో ప్రేమలో పడింది.

అక్రమ్ పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తరవాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ముఖం చాటేశాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version