మంచు ఫ్యామిలీ సినిమాలు నడిచే పరిస్థితి లేదా.!

-

మంచు ఫ్యామిలీ సినిమాలు మానేసే టైమ్ వచ్చిందా అంటే అవుననే అంటున్నారు సినిమా ప్రేక్షకులు. ఒకప్పుడు మోహన్ బాబు డైలాగ్ డెలివరీ కు ప్రత్యేకంగా అభిమానులు వుండే వారు. తర్వాత మోహన్ బాబు సినిమాల్లో వైవిధ్యం చూపకుండా రొడ్డ కొట్టుడు సినిమాల తో అడ్రస్ లేకుండా పోయాడు. తన గత సినిమా సన్నాఫ్ ఇండియా దారుణ పరాజయం పాలయ్యింది. ఆ సినిమా విడుదల రోజు తెగిన టిక్కెట్స్ పై మీడియాలో కుప్పలు తెప్పలుగా గా వచ్చాయి.

ఇక మంచు మనోజ్ చాలా రోజుల క్రితమే నటించడం కు పులిస్టాప్ పెట్టాడు. ప్రస్తుతం విడాకులు తీసుకున్న మనోజ్ వేరే అమ్మాయి తో లవ్ లో వున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి తెలుగు సినిమాలలో నటించి ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయ్యింది. ఇప్పుడు తమిళం, మలయాళం లో ట్రై చేస్తోంది.

ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా పరిస్థితి కూడా దారుణంగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు 10 లక్షలకు అటూ ఇటూగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఆ రోజున సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన విష్ణు టీం ఖర్చు దాదాపుగా అంతే అయి ఉంటుందని సోషల్ మీడియాలో  కామెంట్స్ పేలుతున్నాయి. సినిమా ప్రదర్శన కోసం ధియేటర్ల రెంట్లు కూడా సినిమా తీసిన వాళ్లే కట్టాల్సి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఒక సాధారణ హీరో కు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటిది ఇంత బ్యాక్ గ్రౌండ్ వుండి కూడా,కనీస వసూళ్లు రావడం మీద మంచు ఫ్యామిలీ తీవ్రంగా ఆలోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version