మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో కథనాలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తండ్రి, కొడుకుల మధ్య వైరం బయటపడింది. ఆస్తుల పంపకాల విషయంలో ఈ గొడవలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తండ్రి కొడుకులు పరస్పరం పీఎస్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు.
ముందుగా నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి తనను కొట్టాడని మనోజ్ ఫిర్యాదు చేయగా.. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆస్తుల,స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు చోటుచేసుకున్నట్లు తెలిసింది.మనోజ్ గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని తండ్రి మోహన్ బాబుపై మనోజ్ కంప్లైట్ చేసినట్లు తెలుస్తోంది.