మోడీతో నాకు బాగా చనువు..’మా’ భవనానికి రూ.100 కోట్లు పెడతా : మంచు విష్ణు

-

మా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మంచు విష్ణు కాసేపటి క్రితమే తన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా భవనానికి వంద కోట్లు అయినా ఖర్చు పెడతామని… పీఎం మోడీ తో తనకు బాగా చనువు ఉందని విష్ణు అన్నారు. మా అసోసియేషన్ లోని బై లాస్ అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు బయటి వాళ్ళు వస్తున్నారని… వాటిని మారుస్తామన్నారు.

రవిబాబు మాట్లాడిన దాంట్లో నిజం ఉందని.. తెలుగు వాన్నే ఎన్నుకోవాలని పేర్కొన్నారు. తన మానిఫెస్టో… తెలుగు నటుల ఆత్మ గౌరవమని..అవకాశాలు లేని వారికి అవకాశం కల్పించడమన్నారు. మా కి యాప్‌ క్రియేట్ చేసి… యాప్ లో డైరెక్టర్స్ రైటెర్స్ ఆక్సేస్‌ వుంటుందని వెల్లడించారు.

ఓ టి టీ ప్లాట్ ఫామ్ హౌస్ ల దగ్గర కు వెళ్లి వాళ్ళతో టై అప్ పెట్టు కుంటానని.. మా బిల్డింగ్ తన సొంత డబ్బులతో కడతానని ప్రకటించారు. మూడు స్థలాలను చూసాను సిని పెద్దల సలహాతో ఒక మంచి భవనం కడతామని..తన టర్మ్ లో వందకు వంద శాతం బిల్డింగ్ కడతమని హామీ ఇచ్చారు మంచు విష్ణు. అర్హులైన సభ్యులకు ప్రభుత్వం తో మాట్లాడి సొంత ఇల్లు వచ్చేలా చూడడమని.. ప్రతి ఒక్కరికీ మెడికల్ ఇన్సూరెన్స్ వుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version