గత కొన్ని రోజులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్న గొడవలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేస్తామని చెప్పినప్పటి నుండి దానికి వ్యతిరేకంగా ఉక్కు కర్మాగారం ఉద్యోగులతో పాటు ఆంధ్రప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రి కేటీఆర్ కూడా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గొంతు వినిపించారు. అవసరమైతే విశాఖపట్నం వచ్చి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతామని చెప్పారు.
తాజాగా హీరో మంచు విష్ణు ప్రైవేటీకరణపై తనదైన కామెంట్లు చేసాడు. మోడీ అంటే తనకిష్టం అని చెబుతూనే, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో న్యాయం ఉందని, ఒక బిజినెస్ మేన్ గా ఆలోచిస్తే లాభాలు వచ్చే కంపెనీనే రన్ చేయాలనుకుంటారనీ, ప్రైవేటు వారికి ఇస్తే లాభాలు వస్తాయని అనుకున్నప్పుడు ప్రభుత్వంలోనూ అలాంటి యంత్రాంగాన్ని పెట్టుకుని లాభాలు పండించవచ్చుగా! అన్నాడు. కంపెనీకి నష్టాలొస్తే సీఈవోని మార్చి అవకాశాలు సమకూర్చి లాభాలు తేవాలనుకుంటారు. అలానే ఇక్కడ కూడా చేయచ్చుగా అన్నాడు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిరసనకి మద్దతు పలికాడు.