టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు “జిన్నా” అనే చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జిన్నా అనే టైటిల్ ను తొలగించాలంటూ బీజేపీ పేర్కొంది. కాగా ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడం కూడా బీజేపీని ఆగ్రహానికి గురి చేసింది. జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరు తో సినిమా తీయడం ఏంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఇటీవల ప్రశ్నించారు.
మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. జిన్నా కారణంగా ఎంతో మంది హిందువులు మాన, ప్రాణాలు కోల్పోయారని, వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. అయితే జిన్నాలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్ర పోషిస్తున్నారు. గాలి నాగేశ్వర రావు పేరును షార్ట్ కట్ లో కుదించి జిన్నా అని టైటిల్ గా ఫిక్స్ చేశారు.