నామినేషన్ వేస్తున్నా.. మా ఎన్నికల వివాదంపై స్పందించిన మంచు విష్ణు

-

హైదరాబాద్: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడి బరిలో మంచు విష్ణు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణుతో పాటు ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్.. విష్ణు లోకల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది వివాదంగా మారింది. మా అధ్యక్షుడు నరేశ్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా పోటీ చేయొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు స్పందించారు. ట్విట్వర్ ద్వారా అధికారికంగా లేఖ విడుదల చేశారు.

ఈ లేఖలో మంచు విష్ణు పేర్కొన్న అంశాలు ఇవే..
‘‘‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నా. ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నా. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాలోనే పెరిగా. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూస్తూ పెరిగా. మా కుటుంబ సభ్యల భావాలు, బాధలూ బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో రుణ పడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. మా నాన్న ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి.’’ అని అన్నారు.

మంచు విష్ణు రాసిన అంశాలు మరిన్ని లేఖలో చూడగలరు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version