“మా” అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. డుమ్మా కొట్టిన రఘుబాబు !

-

ఇటీవల జరిగిన మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్… ప్రకాష్ రాజ్ ప్యానల్ పై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. మంచు విష్ణు తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

శివ బాలాజీ,గౌతమ్ రాజ్ ,మాదాల రవి,మాణిక్,హరనాథ్ బాబు,పసునూరి శ్రీనివాస్, అశోక్ కుమార్ ,గీతా సింగ్, శశాంక్, విష్ణు బొప్పన,శివ నారాయణలు మా కార్యవర్గ సభ్యులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రఘుబాబు హాజరు కాలేదు.  అయితే  దీంతో మా ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువు దీరింది.

మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా… పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి రాకపోవడం గమనార్హం. ఆయనకు ఆహ్వానం అందలేదని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version