అజయ్ భూపతి మంగళవారం సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ సినిమా ఇటీవల పాపులర్ ఓటిటి ఛానల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంగళవారం టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెప్తున్నాను అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో కూడా చెప్పారు.
ఇక ఇది ఇలా ఉంటే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులను మంగళవారం సినిమా సొంతం చేసుకుంది. ఉత్తమ నటి పాయల్ రాజ్, ఉత్తమ సౌండ్ డిజైన్ రాధాకృష్ణన్, ఉత్తమ ఎడిటింగ్ గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ముదుసూర్ మహమ్మద్ కి అవార్డులు వచ్చాయి. కథ, కథనాలతో పాటుగా సాంకేతిక పరంగా నిర్మాణపరంగా అద్భుతమైన విలువలు ఉన్న సినిమాగా మంగళవారం సినిమా ఈ అవార్డులను సొంతం చేస్తుంది.