ఎల్బీ నగర్ తీవ్ర విషాదం నెలకొంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి జరిగింది. మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి చెందారు. భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందగా… ఒకరికి గాయాలు అయ్యాయి. మృతులు బీహార్ కూలీలుగా గుర్తించారు.
మట్టి దిబ్బలు కాస్త తడిగా ఉన్న నేపథ్యంలో… అది గమనించకుండా బీహార్ కూలీలు పనిచేశారట. మొత్తం నలుగురు బీహార్ కూలీలు పనిచేస్తుండగా… ఒకసారి గా మట్టి దిబ్బలు కుప్పకూలాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సెల్లార్ తవ్వకాల్లో అపశృతి.. మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం
మృతులు బిహార్ కు చెందిన కూలీలుగా గుర్తింపు pic.twitter.com/vBmwc15xB7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025