కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు

-

అమెరికాలో తానా సభల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అక్కడి ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అవసరమైతే సీతక్క కూడా ముఖ్యమంత్రి కావొచ్చునని వ్యాఖ్యానించారు. దీంతో.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునని వ్యాఖ్యానించారు.

తమ పార్టీలో ఒక్కరు కాదని.. చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క… ఇలా చాలామంది నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలా తమ పార్టీ కాదని, ఆ పార్టీలో కుటుంబంలోని వారే ముఖ్యమంత్రి అవుతారని విమర్శించారు. ఇంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version