తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు మానిక్‌ రావు వార్నింగ్‌

-

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రోజు రోజుకు పెరుగుండటంతో.. అధిష్టానం సీరియస్‌ అయ్యింది. అయితే.. ఈ నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమాలు, హై కమాండ్ ఆదేశాలను బ్రేక్​చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జీ మానిక్​రావు థాక్రే హెచ్చరించారు. గాంధీభవన్​లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇక నుంచి పార్టీ మీటింగ్​లు, కార్యక్రమాలకు ఐదు సార్లు రాకపోతే పార్టీ నుంచి చర్యలు ఉంటాయన్నారు. కార్యకర్తల నుంచి లీడర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందన్నారు.పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు.ఇక రేవంత్​ రెడ్డి పాదయాత్ర సక్సెస్​పుల్​గా కొనసాగుతుందని, ప్రజల నుంచి మంచి ఫీడ్​బ్యాక్​ ఉన్నదన్నారు.

రేవంత్ రెడ్డి 30 నియోజక వర్గాలలో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు అన్ని విభాగాల మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయవంతంగా కార్యక్రమాలు చేశారన్నారు. ఇంటింటికి రాహుల్ గాంధీ సందేశాన్ని అందించారన్నారు.మోడీ, బీజేపీ చేస్తున్న మత విద్వేషాలు ప్రజలకు వివరించారన్నారు.బీజేపీ చేస్తున్న అవినీతిని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే మోడీ భయపడుతున్నారన్నారు. అందుకే అనర్హత వేటు వేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్​ఎప్పటికీ భయపడదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version