ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతలపై ఆమ్ ఆద్మీ పార్టీ దాడి మరింత ఉద్ధృతం చేసింది. దేశాభివృద్ధి కోసం విద్యావంతుడైన ప్రధాని కావాలని.. జైల్లో ఉన్న ఆప్ మాజీ మంత్రి మనీశ్ సిసోదియా డిమాండ్ చేశారు. విద్య ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోలేరని అన్నారు. జైలులో నుంచే సిసోదియా ప్రజలకు ఓ బహిరంగలేఖ రాశారు. ఈ లేఖను దిల్లీ సీఎం కేజ్రీవాల్.. తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
“రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటోంది. ఈ సమయంలో డ్రైనేజీ కాలువలో పైపు పెట్టి మురికి గ్యాస్‌తో ఆహారం తయారు చేయొచ్చని ప్రధాని చెబుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. నిజంగా మురిగి గ్యాస్ నుంచి ఆహారం వండచ్చా? లేదు. మేఘాల చాటున ఎగురుతున్న విమానాన్ని రాడార్ గుర్తించలేదని ప్రధాని మోదీ అన్నప్పుడు ప్రపంచమంతా నవ్వింది. స్కూల్, కాలేజీ విద్యార్థులు ఆయనను వెక్కిరిస్తున్నారు” – మనీశ్ సిసోదియా, దిల్లీ మాజీ మంత్రి
मनीष सिसोदिया ने जेल से देश के नाम चिट्ठी लिखी –
प्रधानमंत्री का कम पढ़ा-लिखा होना देश के लिए बेहद ख़तरनाकमोदी जी विज्ञान की बातें नहीं समझते
मोदी जी शिक्षा का महत्व नहीं समझते
पिछले कुछ वर्षों में 60,000 स्कूल बंद किए
भारत की तरक़्क़ी के लिए पढ़ा-लिखा पीएम होना ज़रूरी pic.twitter.com/VpPyY1Jr2v
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 7, 2023