టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ప్రస్తుత బౌలర్ మహ్మద్ షమీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షమీ టీ ట్వంటి లకు పనికి రాని వాడని అన్నారు. అతను ఒక టెస్ట్ బౌలర్ మాత్రమే నని వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్ తో జరిగే మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతని కంటే మంచి బౌలర్లు ఇండియా లో చాలా మంది ఉన్నారని అన్నారు.
వీరికి అవకాశం ఇవ్వాలని అన్నాడు. నిజానికి షమీ మంచి బౌలర్ అయినా.. పొట్టి ఫార్మెట్ లకు పనికి రాడని తెల్చి చెప్పాడు. అయితే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో షమీ పేలవ ప్రదర్శన చేశాడు. అప్పటి నుంచి షమీ పై చాలా విమర్శలు వస్తున్నాయి. కొంత మంది షమీ కి మద్దత్తు ఇస్తున్నా.. తాజాగా మంజ్రేకర్ వ్యాఖ్యలతో మరోసారి షమీ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ అద్భతంగా రాణించాడు. అయితే మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యల పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.