ప్రతి నెల చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇవాళ 114వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల యొక్క ప్రయత్నాలు స్ఫూర్తి దాయకమైన కథనాలను మన్ కీ బాత్ చూపిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైందన్నారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదిక గా మన్ బాత్ మారిందన్నారు ప్రధాని మోడీ.
మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ప్రధాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు స్ఫూర్తిమంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని.. నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన ఆయన.. నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు. నీటి సంరక్షణకు చాలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.