గుంటూరు తల్లీ బిడ్డా మృతి కేసు.. తల్లికి కరోనా !

-

గుంటూరు తల్లీబిడ్డ మృతి కేసులో భర్త కళ్యాణ్‌, అత్తామామలను అదుపులోకి తీసుకున్నా పోలీసులు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మనోజ్ఞ, ఆమె కూతురు తులసిని అల్లుడే హత్య చేశాడని అత్తామామలు ఆరోపిస్తున్నారు. భవనం పైనుంచి కూడా అల్లుడే తోసేశాడని, హత్యచేసి ఆత్మహత్యలా చిత్రీకరించి ఇంట్లోనే దర్జాగా ఉన్నారని మండిపడుతున్నారు. పోలీసుల ఒత్తిడికి కళ్యాణ్ చక్రవర్తిని ఇంట్లోనే వదిలేశారని, కనీసం విచారణకు కూడా పిలువలేదని విమర్శించారు.

దీంతో కల్యాణ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే మనోజ్ఞ మృత దేహానికి కరోనా పరీక్షలు చేయగా ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక పాప తులసి రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఇక కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మనోజ్ఞ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థంకావటం లేదని, మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని అన్నారు. నేను ఇష్టపడి మనోజ్ఞ ను పెళ్ళి చేసుకున్నానని ప్రతి రోజు ఉదయాన్నే పాపను తీసుకొని మనోజ్ఞ పైకి వెళ్ళేది నిన్న కూడా అలానే వెళ్ళిందని అంటున్నారు. పెద్ద శబ్దంతో పాటు కేక వినపడటంతో బయటకెళ్ళి చూశానని పాప కింద పడి ఉండటం గమనించి కిందకు వెళ్ళానని అప్పటికి మనోజ్ఞ సృహలో ఉండటంతో ఆసుపత్రికి తరలించామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version