విజయనగర: మాన్సాస్‌లో మరో వివాదం తలెత్తింది. మాన్సాస్ ఉద్యోగులుపై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. ఈవో ఫిర్యాదుతో ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెండింగ్ జీతాల కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళన సమయంలో మాన్సాస్ ఈవో కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మన్సాస్ ఉద్యోగులను మాజీ ఛైర్ పర్సన్ సంచయిత రౌడీలతో పోల్చారు. రౌడీలను పంపి ఈవోపై దాడి చేయిస్తావా అంటూ రెండు రోజుల క్రితం సంచయిత ట్విట్ చేవారు. మాన్సాస్ లో సంచయిత ఉన్నప్పుడు ఒక గొడవ, అశోక్ గజపతి రాజు ఛైర్మన్‌గా ఉండగా ఇప్పుడు మరో వివాదం రాజుకుంది.