“చంద్రబాబు – కరువు” కు మధ్య సంబంధాన్ని చక్కగా చెప్పిన మంత్రి కాకాణి…

-

రాష్ట్రంలో రైతుల గురించి జరిగిన సమావేశంలో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని… వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది అని భరోసా ఇచ్చారు. ఒక రైతు విత్తనాలను కొనే దగ్గర నుండి పండిన పంటను అమ్మే వరకు అన్ని విషయాలలో మా ప్రభుత్వం రైతులతో మిళితమై ఉంటుందని చెప్పారు.

 

అంతే కాకుండా రాష్ట్రంలో రైతులకు చుక్కల భూముల సమస్య ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి మంత్రి మాట్లాడుతూ .. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ ఏదో సమస్య ఉండేదని… ముఖ్యంగా కరువు రాష్ట్రం అంతటా తాండవించేదని కామెంట్ చేశారు… చంద్రబాబు మరి కరువు ఒకే కవల పిల్లలు అని చెప్పడం కొసమెరుపు. కాగా ఇప్పటికే జగన్ పంటలను కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాటుకు చేయమని అధికారులను ఆదేశించారు. మరి ఈ కామెంట్స్ పై చంద్రబాబు లేదా టీడీపీ నాయకులు ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version