రాష్ట్రంలో గంజాయి వాడకం క్రమంగా పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాలో మత్తుకు యువత బానిసలు అవుతున్నారు.తాజాగా గంజాయి సేవిస్తున్న కొంత మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో సోమవారం రాత్రి వెలుగుచూసింది. పట్టణ శివారులో పక్కా సమాచారంతో దాడి చేయగా నిందితులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.
దీనిపై విచారణను ప్రారంభించిన పోలీసులు వారికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎంత మొత్తంలో గంజాయి వారి వద్ద ఉందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఎస్సై ఉపేందర్ దీనిపై స్పందిస్తూ కేసు విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు చేపడుతామని తెలిపారు. గంజాయి నెట్వర్క్‌ను ఛేదిస్తామని వెల్లడించారు.