ములుగు జిల్లాలో మళ్ళీ మావోయిస్ట్లు కలకలం రేపారు. మొన్న టీఆర్ఎస్ నేతను చంపినా ములుగు జిల్లాలోనే మావోయిస్టులు ఒక వార్నింగ్ లేఖ వదిలారు. లేఖలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతొ అడవులను జల్లడ పట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. కూంబింగ్స్ ఆపకుంటే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు.
మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తన బొలేరో వాహనం లో పోలీసులను తిప్పడం పద్ధతి కాదు. ప్రజల చేతులలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులు డీఆర్వో ప్రహ్లాద్, రవిందర్, సందీప్ లు ఇంకా చాలా మంది పద్ధతి మార్చుకోవాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితె అక్రమ అరెస్టు లు చేయిస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పెంచతూ ప్రజల పై అక్రమ కేసులు పెడుతూ కేసీఆర్ బలి చేస్తున్నాడని అన్నారు.