మార్చి 15 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ మార్చి – 15- పాల్గుణమాసం- సోమవారం.

 

మేషరాశి:పెద్దల సహాయంతో సమస్యలను అధిగమిస్తారు !

ఈరోజు ఆటంకాలు, ప్రతిబంధకాలతో ప్రారంభమవుతుంది. కానీ రోజు గడుస్తున్నకొద్ది సంతోషం, ఆనందం పెరుగుతుంది. గ్రహచలనాల రీత్యా మీకు చేదు అనుభవం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ  సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. పెద్దల సహాయంతో సమస్యలను అధిగమిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శివారాధన చేయండి అనుకూలంగా ఉంటుంది.

 

todays horoscope

వృషభరాశి:వైవాహికంగా బాగుంటుంది !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది. ఆఫీస్‌లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో ప్రయోజనం పొందుతారు.  వ్యాపారంలో నూతన ఒప్పందాల ద్వారా లాభాలు అందుకుంటారు.  వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు రావచ్చు. కానీ పెద్దల సహకారంతో అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూలం. వైవాహికంగా బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.

 

మిథునరాశి:ఆఫీస్‌లో పై అధికారుల సహకారం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఆఫీస్‌లో పై అధికారుల సహకారం. వ్యాపారాలు లాఆల బాటలో పయనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. అయితే ఏదైనా విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పోయే అవకాశముంది.  విద్యార్థులు చదువులో రాణిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వైవాహికంగా దూరపు బంధువుల నుంచి  శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్‌ పనులు పూర్తి చేసుకుంటారు.

 

కర్కాటకరాశి:ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు !

ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థితకంగా మంచి స్థితి. ఆఫీస్‌లో సానుకూలమైన వార్తాలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.  గ్రహచలనం రీత్యా సంపద రాకను సూచిస్తుంది. వృత్తి, ఉద్యోగ  పురోగతి సాధిస్తారు. మీకిష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు.  విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం శ్రీశివాభిషేకం చేయించండి.

 

సింహరాశి:పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు !

ఈరోజు మంచిగా ఉంటుంది. ఆఫీస్‌లో వత్తిడి కానీ సునాయసంగా అధిగమిస్తారు. ఈరోజు ఆర్థికంగా కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాలు లాభంగా నడుస్తాయి.  పెద్దల సలహాలను పాటిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా బాగుంటుంది. సోమస్కందమూర్తి ఆరాధన చేయండి మంచి ఫలితాలను పొందుతారు.

 

కన్యరాశి:అనూహ్య విజయం సాధిస్తారు !

ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు వస్తాయి.  విద్యార్థులు అనూహ్య విజయం సాధిస్తారు.  మీ పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలను పొందుతారు. కుటుంబ సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వైవాహికంగా బాగుంటుంది. ఆనందరకరమైన రోజు కోసం శివుడికి జిల్లేడు పుష్పాలను సమర్పించండి.

 

తులారాశి:ఈరోజు ఆనందంగా ఉంటుంది !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా గత కొంత కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడుతాయి. ఆఫీస్‌లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో కలసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా మంచి ఫలితాలను పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని కమలాలతో ఆరాధించండి.

 

వృశ్చికరాశి:ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫీస్‌లో తీవ్రమైన వత్తిడి కానీ సహోద్యోగుల సహకారంతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.  ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు సాధారణ లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.

 

ధనస్సురాశి:నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి !

ఈరోజు సంతోషం, ఆనందం ఉంటాయి. కుటుంబ సభ్యులతో ముఖ్య సమస్యలను చర్చిస్తారు. ఆఫీస్‌లో ప్రశంసలు అందుకుంటారు.  సహోద్యోగుల ప్రయోజనాలు, సహకారాన్ని పొందే అవకాశముంది.

నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శివారాధన చేయండి.

 

మకరరాశి:విద్యార్థులు విజయం సాధిస్తారు !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆఫీస్‌లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో సానుకూలమైన ఫలితాలు వస్తాయి.  విద్యార్థులు విజయం సాధిస్తారు. విద్యార్థులు కొత్త ప్రయత్నాల ద్వారా వృద్ధి సాధిస్తారు. వివాదాలలో తలదూర్చంకండి.  పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు వైవాహికంగా బాగుంటుంది. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

 

కుంభరాశి:వివాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు ఆటంకాలు, ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో పని వత్తిడి. సహోద్యుగుల నుంచి సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన వస్తుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర మాటలను మాట్లాడవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధవుల నుంచి కొత్త సమాచారం అందుతుంది. విద్యార్థులకు శ్రమచేయాల్సిన సమయం ఇది. వైవాహికంగా బాగుంటుంది.

 

మీనరాశి:ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఇబ్బందులు, వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దేవాలయాలను సందర్శన చేస్తారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశముంది. విద్యార్థులకు పరీక్ష భయం ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version