ఖాళీ కడుపుతో తినకూడని పదార్థాలివే..!

-

ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటాం. ఎందుకంటే అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చురుకుగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే రోజూ తప్పనిసరిగా టిఫిన్ చేయాలని డైటిషియన్, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గాలనుకునే భావనలో ఉదయంపూట టిఫిన్స్ చేయకుండా ఉంటారు. అల్పాహారం తినకుండా ఉండటం వల్ల ఎంతో ప్రమాదం తలెత్తుతుండని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అల్పాహారం పేరుతో కొందరు నచ్చిన ఫుడ్ తినేస్తుంటారు. ఆ పదార్థాలను తినడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

టిఫిన్స్

ఉదయం పూట అల్పాహారం తీసుకునే సమయంలో కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ని దూరం పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ లాంటి ఉదయం వేళలోనే కాదు అసలు తాగకపోవడమే మంచిదని, ఇందులో కార్బన్ డయాక్సైడ్ (సీఓ2) అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు. సాఫ్ట్ డ్రింక్స్‌లో చక్కెర స్థాయి కూడా అధికంగానే ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనే ఆలోచన ఉన్న వారు వీటికి ఎంతో దూరం ఉంటే అంత మంచిదని అంటున్నారు. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని, దీని స్థానంలో వేడినీటిలో కొంచెం అల్లం కలుపుకొని తాగితే జీర్ణక్రియ వేగంగా పని చేస్తుందన్నారు.

అల్పాహారం ఎక్కువ కారం లేకుండా చూసుకోవాలి. కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడల్లా.. కడుపులో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటంతో అది కొద్ది గంటల పాటు మనకు ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే ఉదయం పూట అల్పాహారం తీసుకునేటప్పుడు కారం పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ముడి కూరగాయలను ఉడికించి, లేదా అలాగే తినడం మంచిదే కాని ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయంటున్నారు. ఉదయం ఏదైనా తిన్న తర్వాత తింటే ఉపయోగం ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే ఉదయం పూట లైట్ ఫుడ్‌కి ప్రిఫర్ చేయాలని కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్, ఎక్కువ కారం పదార్థాలను తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version