ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో సభ ముందుకు నాలుగు బిల్లులు రానున్నాయి. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, ఏపీ లేబర్ వెల్ఫేర్ ఫండ్ బిల్లు, ఏపీ మ్యూచవల్లి ఎయిడెడ్ సహకార సంఘాల బిల్లులను
ఆమోదించనుంది అసెంబ్లీ. అసెంబ్లీలో వివిధ పద్దులపై చర్చ, ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాలు..:
ఫైబర్ నెట్‌లో అవినీతి, నఖినేటిపల్లికి అగ్నిమాపక కేంద్రం, ఇంగ్లీష్ మీడియం లో బోధన, నీరు-చెట్టు విద్యుత్ బకాయిలు, జగనన్న అమ్మ ఒడి, ఎస్సీ, ఎస్టీ లో అభివృద్ధికి నిధుల కేటాయింపులు చేసే అవకాశం ఉంది.
ఇక ఏపీ శాసన మండలి ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఇవాళ మండలి ముందుకు రానున్నాయి మూడు బిల్లులు. ఫారిన్ మేడ్ లిక్కర్ బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, ఎండోమెంట్ బిల్లు ఇవాళ మండలి ముందుకు రానున్నాయి. అలాగే.. పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది.