ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు

-

ఇతరులతో మనకు సంబంధించిన వస్తువులు పంచుకోవడం కామన్.. కావాల్సినప్పుడు సాయం చేయడంలో తప్పు లేదు. కానీ ఆ సాయం మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టేదై ఉండకూడదు కదా..! మనకు తెలిసో తెలియకో చాలా సార్లు ఇవ్వకూడని వస్తువులు ఇతరుకు ఇచ్చేస్తుంటాం. కొందరి రాశుల ప్రకారం.. వారు వాడిన వస్తువులను ఇతరులకు అసలు ఇవ్వకూడదు.. ఒకవేళ..అలా ఇవ్వాల్సి వస్తే..అవి తిరిగి మళ్లీ మీరు వాడుకోవద్దు. ఈరోజు మనం ఇతరులతో పంచుకోకూడని వస్తువులు ఏంటో చూద్దాం..

సాధారణంగా ఒకే కుటుంబంలోని వ్యక్తులు అంతా.. ఒకే దువ్వెనను వాడేస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే.. ఇంటికి వచ్చిన అతిథులు కూడా దానినే వాడుతారు. కానీ ఇలా చేస్తే మీ జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తు ప్రకారం కూడా.. అశుభకరం. అసలు సోప్స్, దువ్వెన వంటివి సపరేట్ గా ఉంటేనే ఆరోగ్యానికి కూడా మంచిది.

కాళ్లకు ధరించే బూట్లు, చెప్పులు శనికి సంబంధించినవి. ఒకరి చెప్పులను వేరొకరు వేసుకోవడం వల్ల శని దోషం వస్తుంది. దీని వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు నిపుణలు చెబుతున్నారు. అందుకే గుళ్లలో చెప్పులు పోతే.. ఎవరూ పెద్దగా ఫీల్ అవరూ.. శని వదిలింది అనుకుంటారు. ఒకరి చెప్పుల్లో మరొకరు కాలు పెట్టడంటో.. వారి దరిద్రాన్ని మనం తీసుకున్నట్లే.

వివాహ ఉంగరాన్ని కూడా వేరొక వ్యక్తికి ఇవ్వకూడదు. అంతేకాదు మీ హనీమూన్ గుర్తుగా భావించే వస్తువులను కూడా ఇతరులతో పంచుకోకూడదు. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయట.

సాధారణంగా చాలా కుటుంబాల్లో ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తారు. అక్కబట్టలు చెల్లి, అన్న బట్టలను తమ్ముడు. కానీ వాస్తు ప్రకారం అలా చేయడం కూడా నిషిద్ధం. ఇలా చేయడం వల్ల దురదృష్టం వస్తుందట. అంతేకాదు ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు. అలర్జీ వంటి సమస్యలు కలుగుతాయి. ఫ్రెండ్స్ కూడా మన బట్టలను ఇస్తుంటాం. అది కూడా అంత మంచిది కాదట. కానీ కొన్ని సందర్భాల్లో తప్పక ఇవ్వాల్సివస్తుంది. అలాంటప్పుడు ఇక మీరు వాటిపై ఆశలు వదిలేసుకోవడమే మంచిది.

ఒకరు వాడే చేతి గడియారాన్ని మరొకరు ధరించకూడదు. మీ వాచ్‌ని వేరొకిరికి ఇస్తే.. అది బ్యాడ్ టైమ్‌ని ఆహ్వానిస్తుందట. అందుకే ఎట్టి పరిస్థితులను వాచీని ఇతరులకు ఇవ్వొద్దంటున్నారు వాస్తునిపుణులు.. లేదంటే అప్పటి నుంచి మీకు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది.అంతేకాదు.. వాచ్ వాడేవారు కూడా కొన్ని సార్లు బ్యాటరీ అయిపోయినా.. షోపీస్ కైనా ఉంటుందిలే అని చేతికి పెట్టుకుంటారు. అసలు పనిచేయని వాచ్ ను చేతికి పెట్టొద్దు. మనం పెట్టుకున్న వాచ్ ఏ బాలేనప్పుడు ఇక మన టైం ఏం బాగుంటుంది..ఇది కూడా చెడుకు సంకేతమే. ఎప్పుడూ.. బ్యాటరీ అయిపోయిన వాచ్ లను ధరించొద్దు.

ఇవన్నీ కొందరికి అస్సలు నమ్మశక్యంగా అనిపించవు. వాస్తుప్రకారం పండితులు అందించినవే తప్ప.. మనలోకం సొంతంగా రాసింది లేదు. ఇలాంటి వాటిని నమ్మేవారు జాగ్రత్తపడతారనే ఉద్దేశంతోనే మీకు అందించడం జరిగిందని గమనించగలరు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version