అక్కడ పెళ్ళికి ముందే అన్నీ..తర్వాతే నచ్చితే పెళ్ళి..

-

ప్రపంచంలో కొన్ని తెగల వారికి కొన్ని ఆచారాలు ఉన్నాయి..వాటికి కట్టుబడి వివాహాన్ని చేసుకుంటారు.. ఎక్కడైనా ఆలు, మగల మధ్య పెళ్ళయిన తర్వాత శారీరక సంబంధం ఉండటం కామన్..జార్ఖండ్‌లో గిరిజనుల వివాహాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ధుకు ఆచారం ఒకటి. అమ్మాయి లేదా అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే వారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారు.

 

అప్పుడు వాళ్ళు అంగీకరిస్తె వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వారు సహజీవనం చేస్తారు. దీనినే ధుకు అంటారు. ఇలాంటి జంటలు పిల్లలు పుట్టాక ఊరు విడిచి కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో ఉండి, తిరిగి స్వగ్రామానికి చేరుకుంటారు. అప్పుడు వారు తమ వివాహానికి సామాజిక గుర్తింపు కోసం గ్రామ పెద్దల దగ్గరకు వెళ్తారు..అప్పుడు గ్రామ పెద్దలు జరిమానా విధిస్తారు.అది చెల్లించాక వారు వివాహం చేసుకుంటారు. తద్వారా వారు వారి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కించుకునే అవకాశం పొందుతారు.

సాధారణంగా ధుకు జంటకు నామమాత్రపు జరిమానా విధిస్తారు. గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేయడానికి మేకలను జరిమానాగా చెల్లించుకోవాలి. ఈ విషయంలో మధ్యవర్తులు ఆ దంపతుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. రాజస్థాన్, గుజరాత్‌లోని గరాసియా తెగలలో కూడా యూవతీయువకులు ఈ విధంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు..వీరికి వివాహం తప్పనిసరి కాదు..ఇక్కడి వాళ్ళు 60 వచ్చేవరకు సహజీవనం చేసి ఆ తర్వాత అయిన పెళ్ళి చేసుకోవచ్చు…

Read more RELATED
Recommended to you

Exit mobile version