సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మసూద’ ట్రైలర్‌.. రౌడీ బాయ్‌ విజయ్‌ అభినందనలు..

-

సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మసూద’. స్వధర్మ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ లో వస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, చాలా ఆసక్తి రేకెత్తిస్తోందని విజయ్ దేవరకొండ తెలిపారు. ట్రైలర్ ను ఆకట్టుకునేలా రూపొందించారని, యావత్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ‘మసూద’ యూనిట్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందున్నాడని, ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తున్నానని తెలిపారు.

Masooda Trailer I Sangitha,Thiruveer, SaiKiran | Rahul Yadav Nakka |  PrashanthVihari | Dil Raju - YouTube

ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. భవిష్యత్ అనేది మనం ఈ రోజు ఏం చేస్తున్నామో అనేదానిపై ఆధారపడి ఉంటుంది.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. అడుగడుగునా ఆసక్తికరంగా ఉంది.

Masooda Trailer I Sangitha,Thiruveer, SaiKiran | Rahul Yadav Nakka | PrashanthVihari | Dil Raju

Read more RELATED
Recommended to you

Exit mobile version