గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాస్ వ్యాక్సినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్ప్రెడర్లుగా పిలవబడే వారందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. కిరాణా షాపులు, కూరగాయలు అమ్మేవాళ్ళు, గవర్నమెంటు ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు మొదలగు వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే హైటెక్స్ మాదాపూర్ లో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నిజానికి ఈ ప్రక్రియ నిన్నటితో పూర్తి కావాల్సి ఉంది. కానీ కావాల్సిన జనాలకి వ్యాక్సినేషన్ అందకపోవడంతో ఈ మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాని మరో ఐదు రోజులు పొడిగించారు.
ఈ రోజుతో పాటు ఐదు రోజులు గడువు పెంచుతున్నామని ప్రకటించారు. ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో 1500మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. 18నుండి 45ఏళ్ళ లోపు వారందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రకటించింది. ఈ ప్రక్రియ జూన్ 21వ తేదీ నుండి మొదలవుతుందని వినిపిస్తుంది.