Breaking : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

-

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా.. కారులో ఉన్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మృతులను ములుగు మండలంలోని జాకారానికి చెందిన వల్లాల కృష్ణయ్య (45), వరంగల్‌కు చెందిన శివ (17)గా పోలీసులు గుర్తించారు. తునికాకు సేకరణ కోసం ఛత్తీస్‌గఢ్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ బైకును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version