విజయ్ మాస్టర్ కి అమెజాన్ ప్రైమ్ ఎంతిచ్చిందంటే..

-

దలపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వసూళ్ళు బాగానే వస్తున్నాయి. తమిళనాట ఇప్పటికీ దుమ్ము దులుపుతుంది. కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. జనవరి 29వ తేదీ నుండి మాస్టర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.

నిజానికి ఫిబ్రవరి 12వ తేదీ నుండి అమెజాన్ కి వస్తుందని అనుకున్నారు గానీ, రేపటి నుండే అందుబాటులో ఉంచనున్నారు. ఐతే ఇంత తొందరగా అమెజాన్ ప్రైమ్ లో వస్తున్నందున దానికోసం మాస్టర్ సినిమాకి బాగానే రేటు పెట్టారట. మొత్తం 36కోట్లు పెట్టి అన్ని భాషక స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకున్నారట. అదీగాక మరో పదిహేను కోట్లు అదనంగా ఇచ్చారని, అనుకున్న దాని కంటే ముందుగా స్ట్రీమింగ అవుతున్నందున 15కోట్లు చెల్లించారంటూ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వినబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version