మహేష్ ఫ్రెండ్ కు అలాంటి రిప్లై ఇచ్చిన మసూద పాప..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అభిమానులు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై చర్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక మహేష్ అభిమాని చేసిన కామెంట్ కు హీరోయిన్ రిప్లై ఇవ్వడంతో అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల టాలీవుడ్లో హారర్ మూవీగా వచ్చిన మసూద బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో సంగీత, తిరువీర్ , బాంధవీ శ్రీధర్ ముఖ్యపాత్రలో నటించారు.

అయితే దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో బాంధవీ శ్రీధర్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఒక్కసారిగా అందర్నీ భయపెట్టేసింది. చాలా రోజుల తర్వాత ఓ హారర్ మూవీ తెలుగులో హిట్ అవడం మాసూద కే చెందింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కూడా తాజాగా ఓటీటీ ఆహా లో ప్రసారమవుతోంది. ఈ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహేష్ అభిమాని బాంధవీ శ్రీధర్ ,మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయితే చూడాలని ఆశగా ఉందంటూ కామెంట్ చేశాడు.

ఈ కామెంట్ కి బాంధవీ శ్రీధర్ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది..” అత్యాశ అనుకోండి కానీ .. అంటే అన్నారు కానీ.. ఆ ఊహ ఎంత బాగుంది..” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు కూడా మహేష్ బాబుతో నటించాలనే ఆలోచన ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version