మీ ప్రేమ పరిణతి చెందిందే అని తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు మీలో ఉండాలి.

-

ప్రేమ.. కాలేజీ యువత దీనికోసం వెర్రెత్తిపోతుంటారు. టక్కున చూస్తారు. మరునాటి నుండే ప్రేమ జపం మొదలెడతారు. అసలు ప్రేమలో అంత ఈజీగా పడవచ్చా అన్నది చాలా మందికి వచ్చే సందేహం. ప్రేమ గురించి డిఫైన్ చేయడానికి ఎవ్వరూ సరిపోరు కాబట్టి, ప్రేమలో పడ్డాక పరిణతి రావాలంటే, ప్రేమలో ఉన్న వారి పరిణతి ఏ విధంగా ఉండాలి అనే విషయాలను, పరిణతి లేని మనుషులు ప్రేమలో ఎలా బిహేవ్ చేస్తారనేది ఇక్కడ తెలుసుకుందాం.

ప్రేమ ఇద్దరు మనుషులని దగ్గర చేస్తుంది. రెండు జీవితాలు ఒక దగ్గరకి వచ్చినపుడు అక్కడ సర్దుకుపోవడం ఖచ్చితంగా ఉండాల్సిందే. అడ్జస్ట్ మెంట్స్ ,కాంప్రమైజెస్ లేకపోతే బంధం నిలబడదు. ఈ విషయం పరిణతి కలిగిన వారికి ఖచ్చితంగా తెలుసు. అందుకే సర్దుకుపోవడంలో వారే ముందుంటారు.

ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ గా ఉండరని వారికి తెలుసు. అందుకే తన భాగస్వామి విషయంలో అన్నీ పర్ఫెక్ట్ గా జరగాలని కోరుకోడు. అలాగే తానూ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకోడు. తనని యాక్సెప్ట్ చేసే భాగస్వామి కోసం ఎదురుచూస్తాడు.

ప్రేమలో గొడవలు సహజం. చిన్నపాటి అల్లర్లు, అలకలు బాగానే ఉంటాయి. ఒకవేళ అవే విషయాలు పెద్దగా మారినా అవతలి వారి మీద నిందలు వేయాలని చూడడు. తప్పు తనదైతే ఒప్పుకుంటాడు.

పరిణతి చెందిన వారు గతాన్ని పెద్దగా పట్టించుకోరు. కాలం ఎప్పటికీ మారుతూనే ఉంటుందని వారికి తెలుసు. అందుకే అవతలి వారి గతాన్ని చూసి వారి ప్రవర్తనని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయరు. అలా వేసినా తమకు ఇష్టం ఉందనుకుంటే వాటిని పట్టించుకోరు. భవిష్యత్తులో వాటిని లేవనెత్తరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version