మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఈటల రాజేందర్ కు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మెదక్ జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమున హర్చరీస్ కు మెదక్ జిల్లా కలెక్టర్ తరఫున నోటీసులు జారీ చేసింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. ఈనెల 16వ తేదీన.. ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలని… తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. 16వ తేదీన విచారణకు హాజరు కాని యెడల… కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాసాయిపేట మండలం అచం పేట హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఈటల రాజేందర్ పై ఉన్నాయి. ఈ ఆరోపణలపై…జూన్ లొనే నోటీసులు జారీ చేసినా… కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ కావడం గమనార్హం. కాగా అక్టోబర్ 30వ తేదీన జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.