కార్తీకదీపం 1191 : తానే స్వయంగా మెడలో మంగళసూత్రం వేసుకున్న మోనిత..ఆనంద్ రావుగారు అంటూ బుడ్డోడితో పూజకు రెడీ

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య మోనితను కలిసింది ఆనంద్ రావుకి చెప్తుంది. నువ్వేం చేశావో అర్థమవుతుందా, ఎందుకు ఇలా చేశావ్, ఒకప్పుడు కార్తీక్ తప్పు చేస్తే నువ్వే దీపకు అండగా ఉన్నావ్..ఇప్పుడు ఎందుకు ఇలా చేశావ్, ఈ విషయం దీపకు తెలిస్తే ఎలా ఆలోచిస్తుందో తెలుసా అని భయపడతాడు. నేను వెళ్లివచ్చాను అంతే..బతిమిలడాడలేదు అంటుంది సౌందర్య. నువ్వు చెప్తే వస్తుందా అంటాడు ఆనంద్ రావు. సౌందర్య ఏదోఒకటి చెప్తుంది. ముందు భారతీతో చెప్పించాను మొండిఘటం కదా వినలేదు, అయినా నేను దీప మీద ఉండే ప్రేమేకోసమే వెళ్లానండి అంటుంది. అయినా ఆనంద్ రావు వినడు. సౌందర్య ఇలా ఆనంద్ రావుతో మాట్లాతుంది. దీప దూరం నుంచి చూసి..అత్తయ్య ఇప్పుడే అక్కడి నుంచి వచ్చినట్లు ఉంది, అసలు ఏం జరుగుంతి, ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకేం తెలియడం లేదు అనుకుంటుంది.
karthika-deepamతెల్లారుతుంది. మరుసటి రోజు ఉదయం దీప పిల్లలను లేపుతుంది. రాత్రంతా మీ నాన్నతో కబుర్లు చెప్పుకున్నారా అంటే..ఏం లేదమ్మా, ఏం మాట్లాడలేదు అని స్కూల్ కి వెళ్తాం అంటారు. రోజు స్కూల్ కి వెళ్లాలి, మీకు బోర్ కొట్టినప్పుడే వెళ్తారా ఏంటి అంటుంది దీప. అలా ఏం కాదమ్మా, అన్నీ ఆన్ లైన్ క్లాసులే కదా అంటుంది శౌర్య. హిమ నువ్వు రాత్రి ఇక్కడ ఎందుకు పడుకోలేదు అంటుంది. దీపకు అసలే వంద ఆలోచనలు, ఆ గొడవరాత్రే అయిపోయింది కదా, మళ్లీ ఇప్పుడు ఎందుకు అంటుంది దీప. హిమ ఎందుకమ్మా నీకు ఈ మధ్య ఊరికే కోపం వస్తుంది, ఏమైందమ్మా అంటారు పిల్లలు. నేను మనిషినే కదా అంటుంది దీప. అలా వాళ్లను లేచి రెడీ అవ్వండి, వారణాసికి ఫోన్ చేసి రమ్మనండి అంటుంది దీప.
ఇంకోపక్క సౌందర్య ఆనంద్ రావుతో పెద్దోడికి మీరైనా చెప్పండి, దోషనివారణ పూజకు రానంటున్నాడు అంటుంది. దోషం చేయటం ఎందుకు మళ్లీ పూజ చేయటం ఎందుకు అంటాడు ఆనంద్ రావు. సౌందర్య ఏంటండి మీరు, అని ముందు గుడికి రమ్మనండి, మీకు బాధ్యత ఉంటుందికదా అంటుంది సౌందర్య. ఆనంద్ రావుకు ఇదంతా నచ్చుదుస ఈ గొడవలోకి నన్ను లాగొద్దుస వీలైతే దీపకు నిజం చెప్పండి అంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి మమ్మీ మోనిత చెప్పిందే నిజం అని నువ్వు నమ్ముతున్నావా అంటాడు. విన్నావ్ కదా అది వరుస మీరు మీరు చూసుకోండి అని ఆనంద్ రావు వెళ్తాడు. సౌందర్య కార్తీక్ తో ఇప్పుడు చర్చ నిజమా కాదా అని, నా కోసం ఈ పూజకు రారా, అక్కడ మోనిత లేరు, బాబు లేరు ఎవ్వరూ లేరు అనుకో, దాని వైపు అసలు చూడకు, నీకేమైనా అయితే దీప, పిల్లలు ఏమేపోతారో అని భయమేస్తుంది, నామీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు గుడికి వస్తున్నాం పూజ చేస్తున్నావం అంతే అని వెళ్లిపోతుంది.
మరోపక్క మోనిత పూజకు రెడీ అవుతుంది. ప్రియమణి ఆనంద్ రావుగారిని రెడీ చేశావా అంటుంది. బుడ్డోడు భలే ముద్దుగా ఉంటాడులే. మోనిత, ప్రియమణి అలా మాట్లాడుకుని..మా ఆనంద్ రావుగారు పేగు మెడకు వేసుకుని పుట్టకపోతే ఇదంతా జరిగేదా ఏంటి అంటుంది. అవును మెడ అంటే గుర్తుకువచ్చింది అని మంగళసూత్రం తీసుకుని తనే వేసుకుంటుంది. ప్రియమణి షాక్ అవుతుంది. అలా చేయటం తప్పుకదమ్మా అంటుంది. మోనిత ఈ లోకంలో తప్పు ఒప్పు అని ఏం ఉండవు, మనకు చేతకాకపోతేనే తప్పు అని తప్పుకుంటాం అంతే అంటుంది మోనిత. అయినా తాళిబొట్టు ఎందుకు అమ్మా అని ప్రియమణి అంటే..గుళ్లో పూజచేస్తున్నారు, పక్కనే మా ఆనంద్ రావు గారు ఉంటారు, కార్తీక్ ఉంటాడు తాళిబొట్టులేకపోతే ఎలా అంటుంది మోనిత. కార్తీకయ్య క‍ట్టాలికదా అంటే..ఆసుపత్రిలో భర్తగా సైన్ చేసినప్పుడే కార్తీక్ నాకు మొగుడయ్యాడు అంటుంది. అలా వాళ్లు మాట్లాడుకుంటారు. పూజకు వెళ్లేందుకు రెడీ అవుతారు.
ఇంట్లో దీప పిల్లలకు బలవంతంగా టిఫెన్ పెడుతుంది. మేం తింటాం కదమ్మా అంటే..ఇంట్లో అందరూ నన్ను పక్కనపెట్టారు మీరు కూడా పెడతారా అని..పక్కనే ఉన్న ఆనంద్ రావుతో మావయ్యగారు అత్తయ్యగారు, ఆయన ఎక్కడికి వెళ్లారు అంటే..ఆనంద్ రావు తెలియదు అంటాడు. మీకు కూడా చెప్పకుండా వెళ్లారా అంటే.. అన్నీ చెప్పాలని లేదుకదమ్మా అంటాడు. హిమ అమ్మా డాడీ ఎక్కడికి వెళ్లుంటారు అని అడుగుతుంది. నాకేం తెలుసు అని దీప కోపపడుటుంది. నీకు చెప్పలేదు సరే, నాకు కూడా చెప్పలేదే అంటుంది హిమ..అంటే ఇంట్లో నా స్థానం ఏంటో నీకు కూడా తెలిసిందనమాట అంటుంది దీప. అలా కాదమ్మా నాకు చెప్తారుకదా..అయినా ఈ మధ్య డాడీ మారారు అమ్మా, ఇదివరకు ఉన్నంత ప్రేమగా ఉండటం లేదు అంటుంది హిమ, అవునమ్మా, డాడీ ఎందుకు మారారమ్మా అంటుంది శౌర్య. నాకేం తెలుసు, మీ డాడీని అడగాల్సిన ప్రశ్నలు కూడా నన్నే అడిగితే ఎలా అని కోప్పడుతుంది దీప. ఇంతలో వారణాసి కార్ హారన్ కొడతాడు. దీప వారణాసి వచ్చినట్లు ఉన్నాడు పదండి అంటుంది. నువ్వుకూడా మాతో వస్తున్నావా అంటే అవును అంటుంది దీప. మరి రెడీ కాలేదు అని శౌర్య అడిగితే..నా మొఖానికి రెడీ అయినా కాకపోయినా పెద్ద తేడా ఏం ఉండదులే, వెళ్లికారులో కుర్చోండి వస్తున్నాను అంటుంది దీప. అలా పిల్లలతో సహా దీప వెళ్తుంది.
ఇక్కడ పూజకు సౌందర్య, కార్తీక్ బయలుదేరుతారు. కార్తీక్ దీప గురించే ఆలోచిస్తాడు. దీప చూపులు బాగా గుర్తుకువచ్చి కారు ఆపేస్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో దీపకూడా అనుకోకుండా గుడికి వెళ్తుంది. అక్కడ మోనిత పక్కన కార్తీక్ కుర్చోని పూజ చేయటం చూసి షాక్ అవుతుంది. పూజారిని అడిగితే..విషయం చెప్తాడు.పాపం వంటలక్క ఏడ్చుకుంటూ వస్తుంది. ఇంటికొచ్చాకా ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version