నకిలీ పత్తి విత్తనాల ముఠాను అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు..!

-

శామీర్ పేటలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాల ముఠాను మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు గుట్టురట్టు చేశారు. కర్ణాటక నుండి తెలంగాణలో ఇతర ప్రాంతాల రైతులకు పత్తి విత్తనాలను తరలిస్తున్నరన్న సమాచారంతో రంగంలోకి దిగిన మేడ్చల్ SOT పోలీసులు చాకచక్యంగా నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా అక్రమంగా నకిలీ పత్తి విత్తనాల తరలిస్తూ అమాయక రైతులకు అమ్ముతూ కోట్ల రూపాయల దండుకుంటున్నారని డిసిపి తెలిపారు.

రైతులను మోసగిస్తున్న ముఠా కర్ణాటక నుండి హైదరాబాద్‌కు వస్తుండగా శామీర్‌పేట ఓఆర్ ఆర్ ఎగ్జిట్ 7 వద్ద ఎస్ఓటి పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేశారు. వాహనంలో పైన జొన్నలు, లోపల నకిలీ విత్తనాలు 37:5 క్వింటాళ్లు తరలిస్తున్నట్లు SOT పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ నరేష్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రైవర్‌ నరేష్ మంచిర్యాల జిల్లా ఖగ మరో ఇద్దరు రమణ సురేష్ పరారీలో ఉన్నట్టు డిసిపి సురేష్ మంచిర్యాల జిల్లా కాగా రమణ కర్ణాటక ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు వారి వద్ద నుండి 37.50 కిలోల నకిలీ విత్తనాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ ఒక ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకోగా వీటి వెలువ మొత్తం దాదాపు 98.75 లక్షల ఉంటుందని డిసిపి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version