Telangana: నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు…. రూల్స్ ఇవే

-

తెలంగాణలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 04వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో అబ్బాయిలు 2,58,895 కాగా.. అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది.

Telangana inter students to face stricter entry rules for exams

ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానుండగా… విద్యార్థులూ ఇవి మర్చిపోవద్దు. ఈ ఏడాది 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అడిషనల్స్‌ ఉండవు. సమాధానాలు మొత్తం అందులోనే రాయాలి. ముందు బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించండి. ప్రతి ప్రశ్నకు సక్రమమైన, నైపుణ్యంతో కూడిన సమాధానాలు ఇవ్వండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్థులకు మానసికంగా మద్దతును ఇవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version