ప్రభుత్వంపై విసుగు.. జీఎస్టీ కట్టనంటున్న హీరోయిన్.

-

దేశంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. సెకండ్ వేవ్ ఉధృతి మరీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సెలెబ్రిటీల నుండి సామాన్యుల వరకూ కరోనా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. హీరోయిన్ మీరాచోప్రా ఇంట్లో కరోనా అతిపెద్ద విషాదాన్ని నింపింది. మీరా చోప్రా ఇద్దరు బంధువులు కరోనాకి బలయ్యారు. అందులో ఒకరు ఆస్పత్రిలో బెడ్ దొరక్క కన్నుమూశారు. మరొకరు కూడా అదే కారణంతో మృతి చెందారు.

రెండు వారాల వ్యవధిలో ఇద్దరిని కోల్పోవడం తీవ్రమైన బాధే. ఆ బాధల్లో ప్రభుత్వ పనితీరును మీరాచోప్రా ప్రశ్నించింది. ఆస్పత్రిలో బెడ్ లేకపోవడం వల్ల చనిపోవడం హత్యా కాదా అన్ని ప్రశ్నని సోషల్ మీడియాలో ఉంచింది. తాజాగా ఆమె జీఎస్టీ కట్టనంటుంది. ఆస్పత్రిలో బెడ్ దొరక్క ప్రాణాలు పోతుంటే జీఎస్టీ ఎందుకు కట్టాలంటూ ప్రశ్నించింది. ఈ విషయంతో దేశంలో కరోనా పరిస్థితులు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version