కోలీవుడ్ భామ.. చనిపోయానంటూ పోస్ట్ పెట్టింది..

-

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో సంచలనం రేపుతున్న మీరా మిధున్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి మాదిరిగా పెద్ద పెద్ద సెలెబ్రిటీలపై అనేక ఆరోపణలు చేసి, వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ తమిళ సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన మీరా మిధున్, సడెన్ గా కోలీవుడ్ సెలెబ్రిటీలపై కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇవన్నీ పబ్లిసిటీలో భాగంగానే చేస్తున్నారన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

జనాల అటెన్షన్ తనమీదకి తెచ్చుకోవడానికే ఇలా చేస్తోందంటూ చెబుతున్నారు. ఐతే తాజాగా మీరా మిధున్ మరో సెన్సేషనల్ కామెంట్ తో ముందుకు వచ్చింది. ట్విట్టర్ వేదికగా మీరా మిధున్ పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. మీరా మిధున్ చనిపోయిందని, పోస్ట్ మార్టమ్ జరుగుతుందని, విచారణ ఇప్పుడే మొదలైందని పోస్ట్ పెట్టింది. తాను చనిపోయానని తన అకౌంట్ నుండే పోస్ట్ పెట్టడం పట్ల అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి మీరా మిధున్ ఆ విధంగా ఎందుకు చేసింద్ఫ్ ఆమెకే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version