ఆర్జీవీకి మ‌ద్ధ‌తుగా ట్వీట్ చేసిన మెగా బ్ర‌ద‌ర్

-

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న సినిమా టికెట్ల విష‌యంలో వ్య‌తిరేక‌త వ‌స్తూనే ఉంది. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ రోజు ఏపీ ప్ర‌భుత్వానికి 10 ప్ర‌శ్న‌లు అంటూ ట్వీట్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ కు చాలా మంది సామాన్యులు, సెల‌బ్రెటీలు మ‌ద్ధ‌తు తెలుపుతున్నారు. తాజా గా మెగా బ్ర‌ద‌ర్ నాగ బాబు కూడా ఆర్జీవీ మ‌ద్ద‌తుగా నిలిచాడు. తాజా గా ఆయ‌న ఆర్జీవీ పోస్టును షేర్ చేస్తు ట్వీట్ చేశాడు.

రామ్ గోపాల్ వ‌ర్మను ఉద్ధేశిస్తు మీరు అడిగిన ప్ర‌శ్న‌లు అన్నీ కూడా నిజ‌లే.. మీరు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నీ కూడా నా నోటీ తో వ‌చ్చేయే అని ట్వీట్ చేశాడు. కాగ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఒక వీడియో ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి 10 ప్ర‌శ్న‌ల‌ను అడిగాడు. దీనికి ముందు ఒక ప్రయివేట్ ఛాన‌ల్ డిబెట్ లో ఏపీ మంత్రి పెర్నీ నాని తో వాగ్వివాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న తర్వాత వీడియో ను పోస్టు చేసి ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో 10 ప్ర‌శ్న‌లు ఉన్నాయ‌ని పోస్టు చేశాడు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుచ్చిన సినిమా టికెట్ల వివాదంలో వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఎంటర్ అయిన త‌ర్వాత ఈ వార్ మ‌రో లెవ‌ల్ కు చేరుకుంది. అలాగే నాగ‌బాబు చేసిన ట్వీట్ కు ఆర్జీవి రిప్లే ఇస్తు.. నాగ బాబు కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే ఈ విష‌యం పై సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఇంకా ప్ర‌శ్నిస్తార‌ని త‌ను న‌మ్ముతున్నాని ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version