CHIRANJEEVI : శబరిమల ఆలయానికి మెగాస్టార్ చిరంజీవి… ఫొటోలు వైరల్‌

-

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. సతీసమేతంగా కేరళ వెళ్ళిన చిరంజీవికి అక్కడి వర్గాలు సాదర స్వాగతం పలికాయి.. తొలుత శబరిమల వెళ్లిన చిరంజీవి దంపతులు… అయ్యప్పస్వామి దర్శించుకున్నారు. కొండ కింది భాగం నుండి చిరంజీవి దోలి ద్వారా అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా డోలి ద్వారా మోసిన అక్కడి కూలీలకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చానని… భక్తులు అలాగే అభిమానుల తాకిడి ఉంటుందని డోలీలో రావలసి వచ్చిందని చిరంజీవి వివరించారు.

 

అనంతరం చిరంజీవి ఆయన భార్య సురేఖ గురువాయూరు చేరుకుని అక్కడి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆపై గురువాయుర్ శ్రీ క్రిష్ణ ఆలయం సందర్శించుకున్నారు చిరంజీవి దంపతులు. అయితే చిరంజీవి శబరిమల టూరు కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా.. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ఆచార్య.  ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version