సుమ షో కి మెగాస్టార్ చిరంజీవి.. సందడే సందడి..!

-

ప్రముఖ కమెడియన్ ఆలీకి ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కడంతో ఆయన నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ఆలీతో సరదాగా కార్యక్రమం పూర్తయింది. మరోపక్క సుమ క్యాష్ ప్రోగ్రామ్ కూడా భారీ పాపులారిటీ తెచ్చుకుంది కానీ ఇప్పుడు ఆ షో కూడా పూర్తయింది అందుకే ఆ షోల స్థానంలో కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈటీవీ నిర్వాహకులు. ఈ క్రమంలోనే బుల్లితెర యాంకర్ గా స్టార్ పొజిషన్ లో కొనసాగుతున్న సుమ తాజాగా ఒక కొత్త గేమ్ షో మొదలుపెట్టింది. “సుమ అడ్డా” అని ఒక కొత్త ప్రోగ్రాం రేపటి నుంచి అనగా జనవరి 7 నుంచి ఈటీవీలో ప్రసారం కాబోతోంది. అయితే ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా షో కి హాజరయ్యి సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.

మరో విషయం ఏమిటంటే ఈ షో కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారట. ఇప్పటివరకు లైఫ్లో చిరంజీవి ఇలా గేమ్ షోలో ఎప్పుడు కనిపించలేదు. మరి మెగాస్టార్ బుల్లితెరపై సందడి చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రెండవ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి గెస్ట్లు గా రానున్నారని సమాచారం. చిరంజీవి ఒక టీవీ గేమ్ షో లాంటి దానికి హాజరు కావడం నిజంగా పెద్ద విషయమనే చెప్పాలి. గతం లో ఆహా లో సమంతా చాట్ షో కి చిరంజీవి హాజరయ్యారు.

అయితే అక్కడ సమంత ఉంది. కానీ ఇక్కడ సుమ చేస్తున్న గేమ్ షో కాబట్టి ఇందులో చిరంజీవి ఎలా సందడి చేస్తారో చూడాలని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు . సంక్రాంతి సందర్భంగా ఈ ఎపిసోడ్ రానుందట. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా అనే షో కి గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version