డైరెక్టర్ బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్..!

-

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన రేంజ్ ఇది కాదు అంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. దీంతో మెగా ఫాన్స్ పడిపోయారు. ఇలాంటి సందర్భంలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను అందించారు డైరెక్టర్ బాబీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. సంక్రాంతి సీజన్ అయిపోయిన సరే చిరంజీవి వింటేజ్ మళ్లీ మళ్లీ చూడడానికి ప్రేక్షకులు థియేటర్లలో పోటెత్తుతున్నారు.. దీంతో కలెక్షన్లలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు వాల్తేరు వీరయ్య.

సినిమా విడుదలైన మొదటి వారంకి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఇదిలా ఉండగా తన టేకింగ్ తో మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ ను తీసుకొచ్చిన డైరెక్టర్ బాబి పనితనానికి చిరంజీవి ఫిదా అయ్యారట. సినిమా కోసం ప్రాణం పెట్టిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు మెగాస్టార్ మర్చిపోలేని కానుక ఇచ్చినట్లు సమాచారం. ముందుగా బాబిని ఇంటికి విందుకు పిలిచిన చిరంజీవి.. భోజనం ముగిశాక అతనికి లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

దీని విలువ అక్షరాల 2 కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చిరంజీవి మరొకసారి తన గొప్ప మనసు చాటుకున్నారు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version