ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించాలని భావిస్తోంది. ఈసారి మాత్రం 21 లేదా 22 పని దినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. మార్చి 3,4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించనుండటంతో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెబుతున్నారు. పరిపాలనా రాజధానిపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.