బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా..నేచురల్ స్టార్ నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో చక్కటి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తనకు వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నది. తెలుగుతో పాటు ఇతర భాషలు తమిళ్, పంజాబీ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.
హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ సుందరి..ఆ తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం తన సినీ కెరీర్ పైనే ఫోకస్ చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ సుందరి. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది.
గతంలో బొద్దుగా ఉండే ఈ భామ..కాస్త సన్నబడింది. తాజాగా ఇన్ స్టా వేదికగా ‘సమ్మర్ వైబ్స్’ అనే క్యాప్షన్ తో ఓ ఫొటో షేర్ చేసింది మెహ్రీన్. పెసరు రంగు టాప్, పింక్ కలర్ స్కర్ట్ ఔట్ ఫిట్ లో అలా గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉంది హనీ.. తన హాట్ థైస్ చూపుతూ అలా ఓరగా చూస్తు కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
ఈ ఫొటోకు సోనాల్ చౌహాన్ లైక్ కొట్టగా, నెటిజన్లు ‘వావ్ సో హాట్ మెహ్రీన్, హనీ హాట్, సో బ్యూటిఫుల్, సో ప్రెట్టీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన F3 సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. ఈ పిక్చర్ ఎఫ్ 2కు సీక్వెల్. ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా హనీగా నటించింది మెహ్రీన్. ప్రస్తుతం ఈ సుందరి శాండల్ వుడ్ ఫిల్మ్ ‘నీ సిగూవరేగు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ పిక్చర్ తో ఈ భామ హీరోయిన్ గా కన్నడ ఎంట్రీ ఇవ్వబోతున్నది.