ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి మెలోడీ సాంగ్ విడుదల

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది. ‘గగనాల తేలేను నీ ప్రేమలోన.. దిగిరాను ఎన్నేసి జన్మలైనా.. తెగిపోయే బంధాలు లోకాలతోనా’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ నేపథ్యంలో సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్ ను ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు. వాస్తవ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే లాంఛ్ చేయగా ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version