అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు రాళ్లదాడి

-

ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని రాగి కుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు అదానీ సంస్థ చేపట్టింది. ఈ క్రమంలోనే అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు రాళ్లదాడికి దిగారు.క్యాంపు కార్యాలయం, జేసీబీ అద్దాలను ఎమ్మెల్యే వర్గీయులు పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన తాళ్ల పొద్దుటూరు పోలీసులు ఎమ్మెల్యే వర్గీయులపై కేసు నమోదు చేశారు.

ఏపీ ప్రభుత్వం అనుమతుల మేరకు రాగి కుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను బుధవారం అదానీ సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు.క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అదానీ, రిత్విక్ సంస్థలు స్థలాన్ని చదును చేస్తున్నాయి.అదే సమయంలో ఈ పనులను తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే బంధువులు శివ నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి ఆ రెండు కంపెనీల ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. మాట వినకపోవడంతో అదానీ కంపెనీ వాహనాలను ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version